- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : పాశమైలారం ఘటనపై ప్రభుత్వ కమిటీ : సీఎం రేవంత్ రెడ్డి
పాశమైలారం(PashaMylaram) పారిశ్రామిక వాడలో నేడు జరిగిన భారీ ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కమిటీ ఏర్పాటు చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : పాశమైలారం(PashaMylaram) పారిశ్రామిక వాడలో నేడు జరిగిన భారీ ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ఈ ప్రమాద ఘటనను దర్యాప్తు చేయడంతో పాటు, ప్రమాదానికి దారితీసిన కారణాలను సమీక్షించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక సీఎస్ (విపత్తు నిర్వహణ), ప్రిన్సిపల్ సెక్రటరీ (కార్మిక), ప్రిన్సిపల్ సెక్రటరీ (ఆరోగ్యం), అదనపు డీజీపీ (అగ్నిమాపక సేవలు)లతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఈ కమిటీ పాశమైలారం దుర్ఘటనను పరిశీలించడంతో పాటు, ఇలాంటివి పునరావృతం కాకుండా నిరోధించే మార్గాలపై ఒక నివేదికను కూడా సమర్పిస్తుంది. మరోవైపు ప్రమాద మృతుల సంఖ్య 14కు చేరింది. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో మరో 35 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.






