- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీహెచ్‌కు సర్కార్ కీలక బాధ్యతలు: రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ సలహాదారుగా నియామకం
తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు నియమితులయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (V. Hanumantha Rao)కు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను రాష్ట్ర మంత్రి హోదాతో (Minister of State) ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. వీ. హనుమంతరావుకు నెలకు రూ. 1,00,000 వేతనం ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒకవేళ ప్రభుత్వ క్వార్టర్ కేటాయించని పక్షంలో, నెలకు రూ. 50,000 ఇంటి అద్దె భత్యం (HRA) పొందే వీలుంది. విధి నిర్వహణలో సొంత వాహనాన్ని ఉపయోగిస్తే నెలకు రూ. 30,000 కన్వేయన్స్ అలవెన్స్‌తో పాటు, రూ. 15,000 ఇంధన ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. దీనికి అదనంగా, డ్రైవర్‌తో కూడిన ప్రభుత్వ వాహనాన్ని పొందే వెసులుబాటు కూడా ఆయనకు ఉంటుంది. అఖిల భారత సర్వీసు (AIS) అధికారులు, మంత్రులతో సమానంగా వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కూడా వీహెచ్‌కు వర్తిస్తుంది.
కార్యాలయ సిబ్బంది కేటాయింపు..
బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారు కార్యకలాపాల నిర్వహణ కోసం బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక సిబ్బందిని కేటాయించింది. ఇందులో ఒక ప్రైవేట్ సెక్రటరీ (PS), ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్లు, ఒక డ్రైవర్ ఉంటారు. ఈ నియామకానికి సంబంధించిన మొత్తం ఖర్చులను బీసీ సంక్షేమ శాఖ రెగ్యులర్ బడ్జెట్ నుంచి భరించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీసీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వానికి కీలక సలహాలు అందించడంలో హనుమంతరావుకు ఉన్న అపారమైన రాజకీయ అనుభవం ఎంతగానో ఉపయోగపడనుంది.






