విలీనంతో పెరిగిన విస్తీర్ణం.. "దిశ" చెప్పిందే జరిగింది

by Naga Rani Yarlagadda |

జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సం స్థల విలీనంతో ఈ ఏరియాను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)గా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విలీనంతో పెరిగిన విస్తీర్ణం.. దిశ చెప్పిందే జరిగింది
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సం స్థల విలీనంతో ఈ ఏరియాను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)గా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విలీనం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ని 300 వార్డులుగా పునర్విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 300 వా ర్డులను ఫిక్స్ చేస్తూ ప్రభుత్వం సోమవారం జీవో నెం.266ను జారీ చేసింది. అయితే వార్డుల పునర్విభజనకు సంబంధించిన ప్ర క్రియను జీహెచ్ఎంసీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంయుక్తంగా చేస్తున్నాయి.

1960 చ.కిమీ విస్తీర్ణం

జీహెచ్ఎంసీ పరిధి 625 చదరపు కిలోమీటర్ల నుంచి 1960 చదరపు కిలోమీటర్ల కు పెరిగింది. ఈ కోర్ అర్బన్ రీజియన్‌లో సుమారు కోటి 30 లక్షల జనాభా ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ జనాభా ఆధారంగానే 300 వార్డులను పునర్విభజించాలని నిర్ణయించారు. అయితే జీహెచ్ఎంసీలో 150 వార్డులు, 27 అర్బన్ లోక ల్ బాడీస్‌లోని 625 వార్డులను కలిపి అ న్నింటిని రీ-ఆర్గనైజేషన్ చేయాలని నిర్ణయించారు. అయితే కోటి 30 లక్షల జనా భాను ఒక్కో వార్డుకు 30 వేల నుంచి 40 వేల జనాభా ఉండే విధంగా వార్డులను రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే జీహెచ్ఎంసీలోని 150 వార్డులను 265 వార్డులుగా ను, 27 యూ ఎల్బీ లకు సంబంధించి న జనాభాను 35 వా ర్డులుగా చేసినట్టు స మాచారం. ఇలా మొత్తం 300 వార్డులను రూపొందించినట్టు అధికారు లు చెబుతున్నారు.

రెండు సర్కిళ్ల చొప్పున

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)లో ఉన్న కోటి30 లక్షల జనాభాను 300 వార్డులుగా పునర్విభజించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే 300 వార్డులను 50 సర్కిళ్లు..10 జోన్లుగా పునర్విభజన చేస్తున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే టీసీయూఆర్ పరిధి హైదరాబాద్, సికింద్రాబా ద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, భువనగిరి లోక్‌స భ స్థానాలతో పాటు 25 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్నది. అయితే ప్రస్తుతం జీ హెచ్ ఎంసీ అంతా గజిబిజిగా ఉన్నది. అసెంబ్లీ నియోజకవర్గానికి, లోక్‌సభ నియోజకవర్గానికి, సర్కిల్‌కు సం బంధం లేకుండా ఉన్నాయి. వీటన్నింటిని క్రమబద్ధీకరించనున్నారు. ఒక అసెంబ్లీ నియోజకవ్గంలో రెండు సర్కిళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. అందుకనుగుణంగా జీహెచ్ఎం సీ టౌన్ ప్లానింగ్ అధికారులు కసరత్తు పూర్తిచేస్తున్నారు.

దిశ చెప్పిందే జరిగింది

జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేసిన నేపథ్యంలో మహా నగరం పరిధి 1960 చదరపు కి లోమీటర్లకు చేరింది. ఈ రీజియన్‌లోని కోటి 30 లక్షల జనాభాను 300 వార్డు లు పునర్విభజించే అవకాశముందని ‘దిశ’ ముందే చెప్పింది. దీనిపై ఈ నెల 3వ తేదీన ‘300 వార్డులు, 50 సర్కిళ్లు, 10 జోన్లు’ అనే కథనం ప్రచురితమైంది.

Next Story