- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొల్లా బ్రహ్మనాయుడికి బిగ్ షాక్.. మరో కేసు నమోదు
by Vemula.Srinu Prasad |
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదు అయింది. ఆయనపై మరో కేసు నమోదు అయింది. ఇటీవలే బ్రహ్మనాయుడు బెయిల్‌పై జైలు నుంచి విడుదల అయ్యారు. ..

X
దివ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు(Former YSR Congress Party MLA Bolla Brahma Naidu)కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు(Case) నమోదు అయింది. ఇటీవలే బ్రహ్మనాయుడు బెయిల్‌పై జైలు నుంచి విడుదల అయ్యారు. ఆ తర్వాత ఆయన గుంటూరు జిల్లా వినుకొండకు వెళ్లారు. అదే రోజు వినుకొండలో వైసీపీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అయితే అనుమతి లేకపోవడంతో పోలీసులు వైసీపీ శ్రేణులను అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులతో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. కొంతసేపు ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. దాంతో బొల్లా బ్రహ్మనాయుడు కాన్వాయ్‌ను వేరే వైపు మళ్లించారు. అయితే ముందస్తు అనుమతి తీసుకోకపోవడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






