- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గూగులోతు పూల్‌సింగ్‌కు డాక్టరేట్ ప్రదానం
'పట్టు పట్టరాదు పట్టి విడువరాదు' అన్నాడు ప్రజాకవి వేమన. వేమన చెప్పిన మాటను నిజం చేస్తూ.. 'తెలంగాణ గిరిజన ఉద్యమాలు -

దిశ, వెబ్ డెస్క్: 'పట్టు పట్టరాదు పట్టి విడువరాదు' అన్నాడు ప్రజాకవి వేమన. వేమన చెప్పిన మాటను నిజం చేస్తూ.. 'తెలంగాణ గిరిజన ఉద్యమాలు - సాహిత్యం' అనే అంశంపై పరిశోధన చేసి, బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నాడు గూగులోతు పూల్‌సింగ్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండాలో గూగులోతు జెమ్లా, సత్తెమ్మలకు జన్మించారు. 1వ తరగతి 10వ తరగతి వరకు తుంగతుర్తిలో, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ విద్యను సూర్యాపేటలో పూర్తి చేసుకుని.. బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.కె. ప్రభాకర్ పర్యవేక్షణలో పిహెచ్.డి. పూర్తి చేశారు.
వీరు చేసిన పరిశోధనకు గాను బెంగళూరు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా రామన్నగూడెం తండా వాసులు, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఒక గిరిజన తండా నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ, బెంగళూరు విశ్వవిద్యాలయం స్థాయికి చేరుకోవటం, పిహెచ్.డి. పట్టాను అందుకోవటం సంతోషంగా ఉంది.
డా. పూల్‌సింగ్‌ను ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో గిరిజనులకు సంబంధించిన చరిత్ర, ఆచారాలు, సంప్రదాయాలపై మరిన్ని పరిశోధనలు జరగాలని అందుకు విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. పట్టభద్రుడైన డా. గుగులోతు పూల్‌సింగ్‌ను బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖాధ్యక్షులు ఆచార్య కె. ఆశాజ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డి. కె. ప్రభాకర్, అధ్యాపక బృందం, పరిశోధక విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.






