- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Google: విమాన ప్రమాద మృతులకు గూగుల్ నల్లరిబ్బన్ తో నివాళి
అహ్మదాబాద్ ప్రమాద మృతులకు గూగుల్ నివాళి అర్పించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పెను విషాదాన్ని మిగిల్చిన అహ్మదాబాద్ లో ఎయిరిండియాకు (Ahmedabad plane crash) చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదంలోని మృతులకు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ (Google) నివాళులర్పించింది. గూగుల్ వెబ్ సైట్ హోం పేజీలో బ్లాక్ రిబ్బన్ ను పెట్టి సంతాపం ప్రకటించింది. సెర్చ్ బార్ కింద నల్ల రిబన్ ఉంచింది. దానిపై కర్సర్ ఉంచినప్పుడు 'విషాదకరమైన విమాన ప్రమాదంలో మరణించిన వారి జ్ఞాపకార్థం' అనే సందేశం కనిపిస్తోంది. కాగా నిన్న 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ పోర్టుకు సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ భవనాలపై కుప్పకూలింది. ఈఘటనలో ఆ విమానం అగ్నికి ఆహుతైపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మందితో పాటు ఆ భవనంలో ఉన్నవారితో కలుపుకుని మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా నివాళులు వెల్లువెత్తుతున్నాయి.






