మహబూబ్‌నగర్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు భోగి.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

by Bhanu |

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం పెద్ద ప్రమాదం తప్పింది.

మహబూబ్‌నగర్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు భోగి.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
X

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూలు నుండి కాచిగూడ వైపు వస్తున్న గూడ్స్ రైలు ఓ భోగి పట్టాలు తప్పింది. సాయంత్రం 7 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో అనేక ప్రధాన రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

పట్టాలు తప్పిన భోగి కారణంగా చెన్నై ఎక్స్‌ప్రెస్ డివిటిపల్లి వద్ద, హంద్రీ ఎక్స్‌ప్రెస్ , బెంగళూరు ఎక్స్‌ప్రెస్ జడ్చర్ల వద్ద, ప్యాసింజర్ రైలు గొల్లపల్లి వద్ద, గుంటూరు–ఔరంగాబాద్ ఎక్స్‌ప్రెస్ దేవరకద్ర వద్ద, రైచూరు..కాచిగూడ ఎక్స్‌ప్రెస్ కౌకుంట్ల వద్ద, వందే భారత్ రైలు వనపర్తి వద్ద నిలిచిపోయాయి. అంతేకాక, అనేక ఇతర రైళ్లు కూడా ఆయా స్టేషన్లలో నిలిచిపోయినట్లు సమాచారం.

రైళ్ల నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి స్టేషన్లలో చిక్కుకుపోయారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించి, పట్టాలు తప్పిన భోగిని తొలగించే పనులు చేపట్టారు. రాకపోకలు పూర్తిగా పునరుద్ధరించేందుకు కనీసం మరో గంట సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.


Next Story