- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రైతు భరోసా’ నిధుల విడుదలపై గుడ్‌న్యూస్.. ఆ రోజే ఖాతాల్లోకి నగదు జమ
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు రెండో విడత ‘రైతు భరోసా’ నిధుల విడుదలపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని రైతన్నలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండో విడత రైతు భరోసా (Raithu Bharosa) నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం (Kataram)లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ వేదిక నుంచే కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేయనున్నారు. రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ విడతలో మొత్తం రూ.5,653 కోట్ల నిధులను ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేయనుంది.
అయితే, సాగు సమయానికి పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తోంది. ఇప్పటికే రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేసిన సర్కార్, ఇప్పుడు రైతు భరోసా నిధులను కూడా విడుదల చేస్తుండటంతో రైతన్నల్లో హర్షం వ్యక్తమవుతోంది.






