- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ రాసే విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. జూన్ 21న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతిష్టాత్మక 'నీట్' (NEET) రాస్తున్న తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది.

దిశ, వెబ్‌డెస్క్: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతిష్టాత్మక 'నీట్' (NEET) రాస్తున్న తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. జూన్ 21వ తేదీన (ఆదివారం) జరగబోయే నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. నీట్ పరీక్ష రాసే విద్యార్థుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా, ఉచిత ప్రయాణాన్ని అందించాలని మంత్రి.. టీజీఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ (MD) వై. నాగిరెడ్డిని ఆదేశించారు.
హాల్ టికెట్ చూపిస్తే చాలు..
ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి విద్యార్థులు ఎలాంటి ప్రత్యేక పాస్లు తీసుకోనవసరం లేదు. జూన్ 21న పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు బస్సు కండక్టర్‌కు తమ 'నీట్ హాల్ టికెట్' (Admit Card) చూపిస్తే సరిపోతుంది. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షా కేంద్రాలు ఉన్న రూట్లలో అదనపు బస్సు సర్వీసులను నడపాలని, స్టాప్‌ల వద్ద బస్సులు విధిగా ఆగేలా చూడాలని ఆర్టీసీ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.






