మహిళలకు గుడ్ న్యూస్.. ఆ పథకం కింద విజయ డెయిరీ పార్లర్ల కేటాయింపులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-23 00:41:42  IST  )

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరో గుడ్‌న్యూస్ చెప్పనుంది.

మహిళలకు గుడ్ న్యూస్.. ఆ పథకం కింద విజయ డెయిరీ పార్లర్ల కేటాయింపులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరో గుడ్‌న్యూస్ చెప్పనుంది. మహిళా సంఘాల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద విజయ డెయిరీ పార్లర్లను కేటాయించేందుకు సిద్ధమైంది. మండలానికి ఒకటి చొప్పున, మున్సిపాలిటీల్లో రెండు చొప్పున మహిళా సంఘాలకు పార్లర్లు కేటాయించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. దీనిపై వారం, పది రోజుల్లో విధివిధానాలను ఖరారు చేయనున్నారు. పార్లర్ కోసం మహిళా సంఘాలు పారిశ్రామికాభివృద్ధి సహకార సమాఖ్యకు రూ.1,000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, స్థలం ఏర్పాటు అనంతరం రూ.5,000 చెల్లిస్తే పార్లర్ మంజూరు చేస్తారు. ఒక్కో పార్లర్ ఏర్పాటుకు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుండగా, దీనికోసం ప్రభుత్వం రుణాలను సైతం అందించనుంది. అయితే ఈ పార్లర్లలో విజయ డెయిరీ ఉత్పత్తులైన పాలు, పెరుగు, పన్నీర్, వాటర్ బాటిళ్లు మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. తద్వారా వచ్చే ఆదాయం మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Next Story