- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా డాక్టర్లకు శుభవార్త.. సెలవులపై కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కీలక ప్రకటన
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య, దంత వైద్య కళాశాలల్లో చదువుతున్న యూజీ (ఎంబీబీఎస్, బీడీఎస్), పీజీ (ఎండీ, ఎంఎస్, ఎండీఎస్), సూపర్ స్పెషాలిటీ కోర్సుల విద్యార్థులు సెలవులు తీసుకున్న తర్వాత తిరిగి చేరే విధానంపై కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య, దంత వైద్య కళాశాలల్లో చదువుతున్న యూజీ (ఎంబీబీఎస్, బీడీఎస్), పీజీ (ఎండీ, ఎంఎస్, ఎండీఎస్), సూపర్ స్పెషాలిటీ కోర్సుల విద్యార్థులు సెలవులు తీసుకున్న తర్వాత తిరిగి చేరే విధానంపై కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. సెలవుల తర్వాత రీ-అడ్మిషన్ పూర్తిగా ప్రభుత్వం, విశ్వవిద్యాలయం, జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ), డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారమే జరగాలని ఆదేశించింది. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ జారీ చేసిన తాజా ఉత్తర్వులు మహిళా పీజీ వైద్య విద్యార్థులకు మాతృత్వ సెలవుల విషయంలో కీలక రక్షణగా మారాయి.
మాతృత్వ సెలవును అనధికార గైర్హాజరుగా పరిగణించరాదని స్పష్టంగా పేర్కొంటూ, సెలవుల అనంతరం తిరిగి విధుల్లో చేరే సమయంలో ఎలాంటి రీ-జాయినింగ్ లేదా రీ-అడ్మిషన్ ఫీజు (రూ.15 వేలు) వసూలు చేయరాదని వర్సిటీ స్పష్టంగా ఆదేశించింది. మాతృత్వ సెలవు కాలానికి సమానంగా కోర్సు వ్యవధిని పొడిగించాలని, సెలవుల అనంతరం రిపోర్ట్ చేసిన వెంటనే కళాశాలలు విద్యార్థినులను తరగతుల్లోకి అనుమతించాలని స్పష్టం చేసింది. గతంలో కొన్ని కళాశాలలు 91 రోజులకు పైగా సెలవు తీసుకున్న మహిళా డాక్టర్లను రీ-అడ్మిషన్ పేరిట ఫీజులు వసూలు చేసి ఆర్థికంగా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో, ఈ ఉత్తర్వులు వారికి న్యాయసమ్మతమైన హక్కును కల్పిస్తూ భరోసాగా నిలిచాయని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






