- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. మరో కొత్త స్కీం
మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందించాలని నిర్ణయించింది. 2023-24 నుంచి 2025-26 మధ్య కాలంలో 15,000 స్వయం సహాయక బృందాలకు డ్లోన్లు ఇవ్వనున్నారు. రైతులకు అద్దె పద్ధతిలో డ్రోన్లను అందించి ఉపాధి పొందేలా స్కీమ్ ను కేంద్రం ప్రవేశపెట్టనుండగా కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
ఈ పథకం కోసం కేంద్రం రూ.1,261 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ‘విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర’లో భాగంగా స్వయం సహాయక బృందాలతో ప్రధాని మోడీ రేపు (గురువారం) ప్రధాని ఇంటరాక్ట్ అవుతారని పీఎంవో కార్యాలయం బుధవారం తెలిపింది. వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ప్రోత్సహించేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ పథకంతో పాటు జన్ ఔషది కేంద్రాల సంఖ్యను 10 వేల నుంచి 25 వేలకు పెంచనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.






