- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bogatha Waterfalls : బోగత జలపాతం వెళ్లే పర్యాటకులకు గుడ్ న్యూస్..
by Sathputhe Rajesh |
ములుగు జిల్లా వాజేడు మండలం బోగత జలపాతం సందర్శనకు వెళ్లే వారికి అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు.

X
దిశ, ఏటూరునాగారం : ములుగు జిల్లా వాజేడు మండలం బోగత జలపాతం సందర్శనకు వెళ్లే వారికి అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. బోగత జలపాతాన్ని పునప్రారంభించడం జరిగిందని వాజేడు అటవీశాఖ రేంజ్ అధికారి బోనోత్ చంద్రమౌళి తెలిపారు. గత కొంత కాలంగా ఏగువ ప్రాంతాలలో వర్షం కురుస్తుండడంతో బోగత జలపాతంలో నీటి ఉధృతి తీవ్రంగా పెరిగింది. అయితే జలపాతం వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో గత 7 రోజుల క్రితం సందర్శన నిలిపివేసారు. కాగా గత రెండు రోజులుగా బోగత జలపాతం వద్ద నీటి ఉధృతి తగ్గుముఖం పట్టడంతో పర్యాటకుల సందర్శన కోసం పునప్రారంభించారు. అయితే కేవలం సందర్శనకు మాత్రమే అనమతులు ఉన్నాయి. జలపాతం వద్ద నీటిలో దిగడం, స్నానాలు చేయడం వంటి వాటికి అనుమతులు లేవని అటవీ శాఖ అధికారి తెలిపారు.
Next Story






