- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో ఇళ్లు కొనాలని చూసేవారికి గుడ్ న్యూస్
స్వగృహ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసిన లే అవుట్లలో ఇండ్లు నిర్మించుకునేందుకు అనువైన ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: స్వగృహ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసిన లే అవుట్లలో ఇండ్లు నిర్మించుకునేందుకు అనువైన ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. నగరానికి సమీపంలో ఉన్న తొర్రూర్, బహూదూర్‌పల్లి, కుర్మల్‌గూడ ప్రాంతాల్లోని 163 ఓపెన్ ప్లాట్లను ఈ నెల 17, 18 తేదీల్లో బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలోని తొర్రూర్ ప్రాంతంలో 200 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 125 ప్లాట్లు, కుర్మల్‌గూడలో 200-300 చదరపు గజాల విస్తీర్ణంలోని 25 ప్లాట్లు, బహదూర్‌పల్లిలో 200-1000 గజాల్లోని 13 ప్లాట్లను విక్రయానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఎటువంటి వివాదాలు లేని, ఈ ప్లాట్లలో తమ అభిరుచులకు అనుగుణంగా ఇండ్లను నిర్మించుకోవచ్చని, ఈ లే అవుట్లలో ఇప్పటికే మౌలిక వసతుల కల్పన కూడా పూర్తయ్యిందని ఎండీ గౌతం తెలిపారు. ఈ ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే.. పెద్ద అంబర్‌పేటలోని అవికా కన్వెన్షన్‌లో ఈ నెల 17,18 తేదీల్లో తొర్రూర్ ప్రాంతంలోని 125 ప్లాట్లకు, 18వ తేదీ మధ్యాహ్నం నుంచి బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడల్లోని ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఎండీ పేర్కొన్నారు.
తొర్రూర్‌లో డిమాండ్..
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఓపెన్ ప్లాట్ల విక్రయాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తొర్రూర్ ప్రాజెక్టు సైట్‌లోని ప్లాట్లను స్వయంగా చూసుకుని నచ్చిన ప్లాట్ల నెంబర్లను నోట్ చేసుకుని వేలం పాటలో పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలపై వాకబు చేస్తూ, ఇప్పటికే ఈ లే అవుట్‌లో ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న వారితో మాట్లాడటంతోపాటు ప్లాట్ల వాస్తును చూసుకుంటూ సందడి చేస్తున్నారు. తొర్రూర్ లే అవుట్‌లో ఉన్న 885 ప్లాట్లలో విడతల వారీగా ఇప్పటివరకు 517 ప్లాట్లను విక్రయించారు. ప్రస్తుతం 125 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో గృహావసరాల భూములకు డిమాండ్ ఉండటం, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.






