Good News: నిరుద్యోగులకు అద్దంకి దయాకర్ గుడ్‌న్యూస్.. ఎక్స్‌లో కీలక మనవి

by Ramesh Naini |   (  Updated:2025-08-18 08:37:00  IST  )

రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Good News: నిరుద్యోగులకు అద్దంకి దయాకర్ గుడ్‌న్యూస్.. ఎక్స్‌లో కీలక మనవి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని (unemployed) నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వారు (Gandhi Bhavan) గాంధీభవన్‌ ముట్టడికి సైతం యత్నించారు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులతో ప్రభుత్వం చర్చలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్లు, సమస్యల పరిష్కారం విషయంలో గత కొన్ని రోజులుగా నిరుద్యోగులతో కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చర్చలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన సోమవారం ఎక్స్ వేదికగా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు.

వారంలో నిరుద్యోగులతో ఉప ముఖ్యమంత్రి భేటీ అవుతారని క్లారిటీ ఇచ్చారు. నిరుద్యోగుల డిమాండ్ల అంశంపై ఈ రోజు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)తో మాట్లాడటం జరిగిందని తెలిపారు. ప్రజా భవన్‌లో నిరుద్యోగులతో డిప్యూటీ సీఎం సమావేశం అవుతారని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఇందుకు నిరుద్యోగులు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, జాబ్ క్యాలెండర్ (Job calendar) ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని గత కొన్ని రోజులుగా వారు ఆందోళనలు చేస్తున్నారు.

ట్వీట్ లింక్..

Next Story