- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపికబురు.. TGPSC నుంచి 3 నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. టీజీపీఎస్‌సీ (TGPSC) ఏకంగా మూడు కీలక నోటిఫికేషన్లను విడుదలయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపికబురు అందించింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఒకేసారి 3 వేర్వేరు ఉద్యోగ నోటిఫికేషన్లను అధికారికంగా విడుదల చేసింది. ప్రభుత్వ రోడ్లు, భవనాల (R&B) శాఖతో పాటు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB)లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్లను జారీ చేశారు. ఈ 3 నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 290 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE), అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్లలో అత్యధికంగా రోడ్లు, భవనాల (R&B) శాఖలోనే ఖాళీలు ఉన్నాయి. ఈ శాఖలో మొత్తం 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) సివిల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటితో పాటు ఇదే శాఖలో మరో 49 ఏఈఈ ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి కూడా అనుమతి లభించింది. ఇక తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి మూడో నోటిఫికేషన్ జారీ అయింది.
ఈ ఉద్యోగాలకు గాను దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని 18 నుంచి 44 ఏళ్లుగా నిర్ణయించారు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఈ 3 నోటిఫికేషన్లకు వేర్వేరు తేదీల్లో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు టీజీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఏఈఈ సివిల్ పోస్టులకు జూన్ 6 నుంచి జూలై 13 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏఈఈ ఎలక్ట్రికల్ పోస్టులకు జూన్ 8 నుంచి జూలై 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. చివరగా అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులకు జూన్ 10 నుంచి ప్రారంభమై జూలై 17 వరకు ఆన్‌లైన్ లింక్ అందుబాటులో ఉంటుంది. విద్యా అర్హతలు, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని టీజీపీఎస్సీ అధికారులు పేర్కొన్నారు.






