JOB CALENDER : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేడు జాబ్ క్యాలెండర్ విడుదల

by Rajesh |
JOB CALENDER : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేడు జాబ్ క్యాలెండర్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని నిరుద్యోగులకు సర్కారు నేడు గుడ్ న్యూస్ చెప్పనుంది. నేడు జాబ్ క్యాలెండర్‌ను కాంగ్రెస్ సర్కారు విడుదల చేయనుంది. ఈ మేరకు అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. జాబ్ క్యాలెండర్‌కు చట్ట బద్ధత తీసుకువస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏటా నిర్దిష్ట కాల వ్యవధిలో నియామకాలు చేపట్టేలా మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. అయితే ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులను భర్తీ చేసే విషయమై జాబ్ క్యాలెండర్ ప్రకటన తర్వాత క్లారిటీ రానుంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే నిరుద్యోగులు దానికి అనుగుణంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ప్రభుత్వం ప్రకటించే జాబ్ క్యాలెండర్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Next Story