- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. ప్రాజెక్టులకు వరద ప్రవాహం
by Ramesh Naini |
తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణలోని నీటి ప్రాజెక్టులకు వరద ప్రవాహం మొదలైంది. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 3వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తోంది. నీటి ప్రవాహం ఇలాగే కొనసాగితే త్వరలోనే జూరాల ప్రాజెక్టు నిండనుంది.
అప్పుడు ప్రధానమైన శ్రీశైలం జలాశయానికి నీళ్లు వదులుతారు. కాగా, దేశంలో నైరుతి రుతుపవనాల రాక మొదలైంది. ఈ క్రమంలోనే అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ చత్తీస్‌గడ్, దక్షిణ ఓడిశఆతో పాటు కోస్తా ఆంధ్రా లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
Next Story






