సామాన్యులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఉల్లి ధరలు.. కేజీ ఎంతంటే?

by Jakkula.Mamatha |

రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజలకు శుభవార్త వచ్చింది

సామాన్యులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఉల్లి ధరలు.. కేజీ ఎంతంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజలకు శుభవార్త వచ్చింది. నిత్యావసరాల్లో ఉల్లిపాయలు కూడా ఎంత అవసరం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పెరిగిన ఉల్లి ధరలు సామాన్యులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఉల్లి ధరలు బాగా తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉల్లిపాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ(Telangana)లోని హైదరాబాద్(Hyderabad) మలక్‌పేట్ మార్కెట్‌లో క్వింటాల్ రూ.1200 ఉండగా, కనిష్ఠంగా రూ.500 వరకు పలుకుతున్నాయి. ఉల్లి ధరలు(Onion Price) గతంలో భారీగా పెరగడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.

ఈ క్రమంలో బహిరంగ మార్కెట్‌లో గత నెలలో కిలో రూ.40 వరకు ఉన్న ధర ఇప్పుడు రూ.15కు పడిపోయింది. ఈ నేపథ్యంలో యాసంగి దిగుబడి మరింతగా పెరగడంతో ఈ నెలాఖరుకు మరింతగా ధరలు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉల్లి రైతులు తమకు ఆదాయం లేక నష్టపోతున్నమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా క్రమ క్రమంగా పెరుగుతూ వచ్చిన ధరలు ఇప్పుడు భారీగా తగ్గడంతో సామాన్యులకు ఊరట లభించింది.

Next Story