- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలోని నిరుపేదలకు గుడ్ న్యూస్: క్యూర్ పరిధిలో లక్ష ‘ఇందిరమ్మ LIG' ఇండ్లు
క్యూర్ (CURE) పరిధిలోని పేదల కోసం లక్ష ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: గ్రామీణ ప్రాంతాలలో ఇందిరమ్మ ఇండ్లతో పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం, ఇప్పుడు అదే సంకల్పంతో క్యూర్ పరిధిలోని పేదల సొంతింటి స్వప్నాన్ని నిజం చేసేందుకు మరో చారిత్రాత్మక అడుగు వేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో దశల వారీగా లక్ష ఎల్.ఐ.జీ. ఇందిరమ్మ ఇండ్లను నిర్మించబోతున్నామని, ఇందుకు సంబంధించి ఇప్పటికే పరిపాలనా అనుమతులు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఇవాళ సచివాలయంలోని తన కార్యాలయంలో క్యూర్ పరిధిలో ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇండ్లపై హౌసింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. ఈ నెల 20వ తేదీన క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్ల పథకానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌తో కలిసి పథకానికి సంబంధించిన విధివిధానాలను, దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు, టెండర్ల ప్రక్రియ, అమలు విధానం తదితర పూర్తి మార్గదర్శకాలను ప్రకటిస్తామని వివరించారు.
2026-27 ఆర్థిక సంవత్సరంలో క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గానికి కనీసం 500 చొప్పున, ఆయా స్థానిక పరిస్థితులను బట్టి అవసరమైన చోట వెయ్యి వరకు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.గత ప్రభుత్వం ఎలాంటి ముందుచూపు లేకుండా, హైదరాబాద్ నగరానికి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో అక్కడక్కడ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతామనే ఆందోళనతో చాలామంది అక్కడ నివసించలేకపోయారని అన్నారు. తమ ప్రభుత్వం మాత్రం పేదల జీవన వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని, వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే, వారి ఉపాధి, పిల్లల విద్య, వైద్య సౌకర్యాలు, రవాణా వంటి అంశాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లను నిర్మిస్తోందని అన్నారు. ఆ స్థలంలో వారికి వాటా ఇస్తూ యాజమాన్య హక్కు కల్పిస్తూ వారి కుటుంబాలకు శాశ్వత ఆర్థిక భద్రతను కల్పిస్తున్నామన్నారు.
క్యూర్ పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నియోజకవర్గాలలో స్థలాలను గుర్తించడం జరిగిందని, ఈ స్థలాలను ఇప్పటికే హౌసింగ్ విభాగం పొజిషన్‌లోకి తీసుకుందని తెలిపారు. ఎక్కడ ఎన్ని ఇండ్లు, ఎన్ని అంతస్తులు నిర్మించాలి, ఒక్కో ప్లాట్ విస్తీర్ణం, బిల్డింగ్ డిజైన్‌లను సీఎం రేవంత్ రెడ్డి గారితో చర్చించి రెండు, మూడు రోజులలో తుది రూపును ఇస్తామని వెల్లడించారు.






