- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TGPSC గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఎల్లుండే నియామకపత్రాలు అందజేత
టీజీపీఎస్సీ గ్రూప్ -1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: టీజీపీఎస్సీ గ్రూప్ -1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 27వ తేదీన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. శిల్పకళావేదికలో 562 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయనున్నారు. గ్రూప్ -1 నియామకపత్రాల పంపిణీ కార్యక్రమ నిర్వహణపై సీఎస్.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. రేపటిలోగా సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కాగా.. గ్రూప్ -1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గత అర్థరాత్రి ప్రకటించింది. ఈ లిస్టులో 900 మార్కులకు గాను 550 మార్కులతో మల్టీజోన్-2 కేటగిరిలో హైదరాబాద్ కు ఏఎస్ రావు నగర్ కు చెందిన లక్ష్మీదీపిక టాపర్ గా నిలిచింది. నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ 535.5 మార్కులతో సెకండ్ ర్యాంక్ సాధించగా.. వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, సిదాల కృతిక, హర్షవర్ధన్, కె.అనూష, ఏరెండ్ల నిఖిత, కె.భవ్య, శ్రీకృష్ణసాయి టాప్ 10 ర్యాంకర్స్ గా నిలిచారు.






