- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. 100 శాతం సబ్సిడీతో మరో కొత్త స్కీమ్
తెలంగాణలో బీసీ మహిళల స్వయం ఉపాధికి సర్కార్ శ్రీకారం చుట్టింది. ప్రతి నియోజకవర్గంలో 1000 మందికి 100 శాతం సబ్సిడీతో కుట్టు మిషన్ల పంపిణీకి ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల (బీసీ) మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నైపుణ్యం కలిగిన బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మంది మహిళలకు 100 శాతం సబ్సిడీతో అత్యాధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం అమలుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే అప్లికేషన్లు:
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల పక్షాన మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి 1000 మంది మహిళలకు కుట్టు మిషన్లు 100 శాతం సబ్సిడీతో మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అప్లికేషన్ స్వీకరించి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు చొప్పున స్వయం ఉపాధి పెంచుకొని ఆర్థికంగా ఆసరాగా ఎదగడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. బలహీన వర్గాల శాఖ పక్షాన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంతోపాటు, స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు చేయడానికి శాఖ ప్రణాళికలు చేస్తుందని తెలిపారు.






