తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యకు రూ.20 లక్షల సాయం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-15 07:54:51  IST  )

తెలంగాణలోని మైనారిటీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యకు రూ.20 లక్షల సాయం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని మైనారిటీ విద్యార్థులకు (Minority students) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు 'సీఎం ఓవర్సీస్ స్కాలర్ షిప్ (CM Overseas Scholarship)' ద్వారా చేయూతనిస్తోంది. ఈ స్కాలర్షిప్‌కు ఎంపికైన 500 మంది విద్యార్థులకు రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. అర్హులైన విద్యార్థులు అమెరికా, యూకే వంటి దేశాల్లో చదువుకోవచ్చు. ఇక ఈ ఏడాదికి గానూ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. జూన్ 30వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజుగా ప్రకటించింది.

దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కచ్చితంగా తెలంగాణ నివాసితులై ఉండాలి. ఇస్లాం, సిక్, క్రిస్టియన్, బౌద్ధ, జైన, పార్సి వర్గాలకు చెందినవారై ఉండాలి. గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60% మార్కులు సాదించాలి. కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షలు మించకూడదు. పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ పొందాలి. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 35 సంవత్సరాలు మించకూడదు. ఆధార్ కార్డ్, పాస్ ఫోటో, విద్యా అర్హత సర్టిఫికెట్లు, ఇంటి ఆదాయ ధ్రువీకరణ పత్రం, కమ్యూనిటీ సర్టిఫికెట్, యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్, ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ స్కోర్ కార్డు కలిగి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://telanganaepass.cgg.gov.in/ ను సందర్శించండి.

Next Story