- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో పని చేస్తోన్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పనిచేస్తూ తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వేతనంతో కూడిన సెలవు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పనిచేస్తూ తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సెలవుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సెలవు దరఖాస్తుకి ఓటరు కార్డు జత చేయాలని సూచించారు. కాగా, ఉద్యోగుల సంఘం నేతలు చేసిన విజ్ఞప్తికి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం అయ్యింది. అధికారులు పోలింగ్‌కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని డిస్ట్రిబ్యూట్ చేశారు. రేపు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ మొదలు కానుంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం గంట ముందే అంటే 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ క్లోజ్ కానుంది. పోలింగ్ ముగింపు సమయం కల్లా పోలింగ్ బూత్‌లో ఉన్నవారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.






