- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking News : విద్యార్థులకు గుడ్ న్యూస్.. మెనూలో మటన్ కూడా
దిశ, వెబ్ డెస్క్ : అన్ని సంక్షేమ, గురుకుల హాస్టల్స్(Gurukula Hostels) విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంక్షేమ హాస్టల్స్(Welfare Hostels)పై సీరియస్‌గా ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం(Telangan Govt) తనిఖీల పేరుతో హాస్టల్స్ బాటపట్టింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా హాస్టల్స్, గురుకులాల్లో తనిఖీలు చేపట్టారు. విద్యార్థులతో మాట్లాడి.. వాళ్లతో కలిసి భోజనాలు చేశారు. హాస్టల్ విద్యార్థులకు పోషకాహారంతో పాటు, రుచికరమైన భోజనం అందించడంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు అమలవుతున్న డైట్‌లో పలు మార్పులు చేస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా మెనూ(Food Menu) సిద్ధం చేసింది. ప్రభుత్వ హాస్టళ్లలో ఇప్పటి వరకు ప్రతి ఆదివారం చికెన్ పెడుతున్నారు. అయితే తొలిసారిగా విద్యార్థులకు మటన్(Motton) పెట్టబోతున్నారు. ఇకపై లంచ్‌లో నెలలో రెండు సార్లు మటన్, 4 సార్లు చికెన్ పెట్టనున్నారు. నాన్ వెజ్ భోజనం పెట్టినప్పడు సాంబార్, పెరుగు కూడా ఉంటుంది. నాన్ వెజ్ తినని వారికి ఆ రోజుల్లో మీల్ మేకర్ కర్రీ పెడతారు. నాన్ వెజ్ లేని మిగతా రోజుల్లో లంచ్‌లో ఉడికించిన గుడ్డు లేదా ఫ్రైడ్ ఎగ్ ఇస్తారు.