విద్యార్థులకు ఎగిరిగంతేసే శుభవార్త.. వరుసగా సెలవులు.. ఎప్పుడెప్పుడంటే?

by Jakkula.Mamatha |

విద్యార్థుల(Students)కు గుడ్ న్యూస్ వచ్చింది

విద్యార్థులకు ఎగిరిగంతేసే శుభవార్త.. వరుసగా సెలవులు.. ఎప్పుడెప్పుడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: విద్యార్థుల(Students)కు గుడ్ న్యూస్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచే ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మండుతున్న ఎండలతో స్కూల్‌కి వెళ్లె విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు చల్లటి కబురు అందింది.

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) హోలీ పండుగ(Holi Festival) సందర్భంగా మార్చి 14 (శుక్రవారం) సెలవు ప్రకటించింది. హోలీ నేపథ్యంలో ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలకు హాలిడే(Holiday) కాబట్టి విద్యార్థులతో పాటు ఉద్యోగులకు కూడా కాస్త ఉపశమనం లభిస్తుందనే చెప్పవచ్చు. ఆ తర్వాత మార్చి 15(శనివారం), 16 (ఆదివారం వీకెండ్) కూడా కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు, కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయి. దీంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి.

Next Story