విద్యార్థులకు గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్, టీజీటీడబ్ల్యూఆర్ఈఐఎస్, టీజీఎంజేబీపీడబ్ల్యూఆర్ఈఐఎస్, టీజీఆర్ఈఐఎస్ 5వ తరగతిలో ప్రవేశానికి ఈఏడాది ఫిబ్రవరి 23న రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రెన్​ఎగ్జామ్​నిర్వహించడం జరిగింది.

విద్యార్థులకు గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్, టీజీటీడబ్ల్యూఆర్ఈఐఎస్, టీజీఎంజేబీపీడబ్ల్యూఆర్ఈఐఎస్, టీజీఆర్ఈఐఎస్ 5వ తరగతిలో ప్రవేశానికి ఈఏడాది ఫిబ్రవరి 23న రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రెన్​ఎగ్జామ్​నిర్వహించడం జరిగింది. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారి ఫలితాలను మొదటి ఫేజ్ లో రెండు దఫాలుగా రిలీజ్​చేయడం జరిగింది. ఇక మిగిలిన వివిధ కేటగిరీలకు చెందిన 13,130 సీట్లకు గాను ఫలితాలను ఆదివారం విడుదల చేయడం జరిగిందని టీజీ సెట్​2025 చీఫ్ కన్వీనర్ డాక్టర్​విఎస్. అలగు వర్షిణి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థుల జాబితా కోసం గురుకుల అధికారిక వెబ్ సైట్​www.tgswreis.telangana.gov.in నందు ఫలితాలను చూసుకోవాలని టీజీ సెట్ 2025 చీఫ్ కన్వీనర్ సూచించారు.

Next Story