- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్పంచ్ ఆశావహులకు గుడ్ న్యూస్.. పంచాయతీ ఎన్నికలపై కీలక అప్‌డేట్
సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఆశావహులకు గుడ్ న్యూస్.

దిశ, వెబ్‌డెస్క్: సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఆశావహులకు గుడ్ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికలపై మరో కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు గాను గుజరాత్ (Gujarat) నుంచి రాష్ట్రానికి 37,530 బ్యాలెట్ బ్యాక్సులు వచ్చాయి. అయితే, అధికారులు నేడు లేదా రేపు జిల్లాల వారీగా పంపిణీ చేయనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. మరో వైపు విద్య, ఉద్యోగ, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
తెలంగాణ (Telangana) చట్ట సభల్లో ఆమోదించిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ నుంచి నేరుగా రాష్ట్రపతికి చేరింది. బీసీ రిజర్వేషన్ల ఆమోదం విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్, బీసీ సంఘాలు ఢిల్లీ (Dehli)లోని జంతర్ మంతర్ (Janthar Manthar) వద్ద మహా ధర్నా చేపట్టాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై కీలక అడుగు వేయబోతోంది. పార్టీ పరంగా బీసీకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై ఈ నెల 18న కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు రేపు ఆయన పంచాయతీ రాజ్ అధికారులతో భేటీ అవుతుండటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.






