- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ కార్మికులకు తీపికబురు.. ప్రభుత్వంలో విలీనంపై మంత్రి కీలక ప్రకటన
ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ అనే మూడు ప్రధాన అంశాలపై ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందుకు పోతోందని మంత్రి పొన్నం అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తమ ప్రభుత్వ బాధ్యత అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఇవాళ పెద్దపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu)తో కలిసి ఆయన మంథని బస్ స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెద్దపల్లి డిపో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ సమీక్ష నిర్వహించిందని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలు కుంభమేళా తరహాలో జరగనున్న నేపథ్యంలో, వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రజా రవాణాకు లైఫ్‌లైన్ అయిన ఆర్టీసీకి సంబంధించి బాసర నుంచి భద్రాచలం వరకు ప్రతి బస్టాండ్‌ను, డిపోను నవీకరిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, భద్రత, అలాగే ఆర్టీసీ సంస్థ పరిరక్షణ అనే మూడు ప్రధాన అంశాలపై ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందుకుపోతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీలో కొత్త నియామకాలు చేపడుతున్నామని, కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 310 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. ఇక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ప్రజాస్వామిక హక్కు అయిన గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి, ఆయా సంఘాల ప్రతినిధులతో అధికారుల కమిటీతో భేటీ అయి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.






