- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు గుడ్ న్యూస్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోన్న గ్యారంటీలన్నింటికీ రేషన్ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోన్న గ్యారంటీలన్నింటికీ రేషన్ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. వెంటనే అందుబాటులో ఉన్న రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ-కేవైసీ చేసుకోవాలని పౌరసరఫరాల అధికారులు ప్రజలకు సూచించారు. ఇప్పటికే గత ఫిబ్రవరి 29తో ఈ-కేవైసీ గడువు ముగిసింది. అయితే, అనేకమంది లబ్ధిదారుల నుంచి విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మొత్తం లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 74శాతం మంది ఈ-కేవైసీ పూర్తి చేశారని తెలిపింది. ప్రస్తుతానికి గడువు తేదీ పొడిగించడంతో.. మరోసారి పొడిగించే అవకాశం ఉండకపోవచ్చని.. అందుకే తప్పనిసరి అందరూ వెంటనే పూర్తి చేసుకోవాలని సూచించింది. కాగా, ఈ-కేవైసీ ఆధారంగానే రేషన్ కార్డులో పేరున్న వ్యక్తి కుటుంబంలో సభ్యుడా? కాదా? అనేది తెలుసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అర్హులకు మాత్రమే రేషన్ అందుతుంది.






