- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండుగ వేళ.. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వాటర్ బాటిల్ ధర తగ్గించిన రైల్వే శాఖ
దసరా పండుగ వేళ.. రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.

దిశ, తెలంగాణ బ్యూరో: (Dasara) దసరా పండుగ వేళ.. రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రైళ్లలో, రైల్వే స్టేషన్స్, అక్కడి పరిసరాల్లో విక్రయించే (Rail Neer Water Bottles) రైల్ నీర్ వాటర్ బాటిల్స్ ధర తగ్గిస్తూ తాజాగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రైల్ నీర్ వాటర్ బాటిల్ లీటర్ రూ.15లకు విక్రయిస్తుండగా.. ఇక నుంచి రూ.14 లకే లభించనుంది. అలాగే 500 ఎంఎల్ బాటిల్‌పై కూడా రూ.1 తగ్గించింది. గతంలో రూ.10 ఉన్న హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ధర ఇప్పుడు కేవలం రూ.9లకే లభించనుంది. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ పలు వస్తు సేవలపై జీఎస్టీ తగ్గించిన నేపథ్యంలోనే రైల్ నీర్ బ్రాండ్ వాటర్ బాటిల్స్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందించేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి.






