రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చర్లపల్లిలో స్లీపింగ్ పోడ్స్

by Muthe.Rajitha |

హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో ప్రయాణికులకు సౌకర్యంగా స్లీపింగ్ పాడ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చర్లపల్లిలో స్లీపింగ్ పోడ్స్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో ప్రయాణికులకు సౌకర్యంగా స్లీపింగ్ పాడ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సేవ రైలు ఆలస్యం అయినప్పుడు లేదా రాత్రివేళ విశ్రాంతి అవసరమైన ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనుంది. ఎయిర్ కండిషన్డ్‌గా ఉండే ఈ స్లీపింగ్ పాడ్స్‌లో ప్రైవేట్ స్పేస్, వై-ఫై, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, బెడ్, లైటింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఛార్జీల విషయానికి వస్తే 2 గంటలకు రూ.200, 24 గంటలకు రూ.1,200గా నిర్ణయించారు. హోటల్ రూమ్‌లతో పోలిస్తే తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన విశ్రాంతి లభించడంతో దీర్ఘ ప్రయాణాలు చేసే వారికి ఇది మంచి ఉపశమనం కలిగిస్తుంది.

Next Story