OU విద్యార్థులకు గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

ఉస్మానియా యూనివర్సిటీ(OU) పరిధిలో విద్యార్థులకు గుడ్ న్యూస్.

OU విద్యార్థులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఉస్మానియా యూనివర్సిటీ(OU) పరిధిలో విద్యార్థులకు గుడ్ న్యూస్. ఓయూ పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ విభాగాల్లో బ్యాక్ లాగ్స్(Back logs) ఉన్న విద్యార్థులకు అధికారులు ఓ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. మరోసారి ఈ పరీక్షలు రాసుకునే వన్ టైమ్(One Time) అవకాశం కల్పించారు. 2000 నుంచి 2015 మధ్యలో చదివి, ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరైనా తిరిగి పరీక్షలు రాయవచ్చు. విద్యార్థులు చదివిన కాలంలో చివరి ఏడాది సిలబస్ ప్రకారం ఈ పరీక్షలు జరుగుతాయి. అలాంటి విద్యార్థులు జూన్ 19 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చునని తెలిపారు. లేట్ ఫైన్ తో జూన్ 25 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని అన్నారు. వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ జులైలో జరుగుతాయని పేర్కొన్నారు.

Next Story