- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనారిటీ విద్యార్థులకు గుడ్ న్యూస్: సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తులు ప్రారంభం
సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి (స్ప్రింగ్ సీజన్-2026) సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం (స్ప్రింగ్ సీజన్-2026)కు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, డాక్టోరల్/పీహెచ్‌డీ కోర్సుల్లో చేరిన మైనారిటీ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ షఫీవుల్లా పేర్కొన్నారు. యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ దేశాల్లో చదివే వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్‌షిప్, వన్-వే విమాన చార్జీల కింద రూ.60 వేల వరకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 1 నుంచి జూన్ 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.telanganaepass.cgg.gov.inను సంప్రదించాలని షఫీవుల్లా సూచించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ 30 మధ్య కాలంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు మాత్రమే ఈ ‘స్ప్రింగ్ సీజన్-2026’కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని స్పష్టం చేశారు.






