ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ కళాశాలల్లో అదిరిపోయే అల్పాహారం

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-27 16:31:07  IST  )

ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించనున్నారు.

ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ కళాశాలల్లో అదిరిపోయే అల్పాహారం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు రేవంత్ సర్కార్ తీపికబురు చెప్పింది. ఈ విద్యాసంవత్సరం (2026–27) నుంచే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం (Breakfast), మధ్యాహ్న భోజనం (Mid-day Meal) అందించాలని నిర్ణయించింది. విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు.

రోజుకో రకం బ్రేక్‌ఫాస్ట్ మెనూ..

అయితే, విద్యార్థులకు బోర్ కొట్టకుండా ఉండేందుకు బ్రేక్‌ఫాస్ట్‌లో రోజుకో రకమైన రుచికరమైన మెనూను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. మిల్లెట్ ఇడ్లీ, చట్నీ, సాంబార్, పూరీ, వెజిటబుల్ కుర్మా, బోండా, ఉప్మా వంటి పోషకాలు కలిగిన పదార్థాలను బ్రేక్‌ఫాస్ట్‌గా ఇవ్వనున్నారు. అదేవిధంగా డే బై డే గ్లాస్ పాలు, రాగిజావను కూడా మెనూలో యాడ్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని జూన్ 12న సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. తొలుత ఈ బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని 64 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రారంభించనున్నారు. ఒకవేళ అక్కడ సక్సెస్ అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కళాశాలలకు వర్తింపజేస్తారు. ఈ పథకం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ చదువుతున్న సుమారు 1.92 లక్షల మంది విద్యార్థులకు నేరుగా లబ్ధి చేకూరనుంది.

Next Story