- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ 2.0 కింద గృహ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ 2.0 కింద గృహ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల వ్యయంతో రాష్ట్రంలోని 118 పట్టణ ప్రాంతాల్లో మొత్తం 18,213 ఇండ్లను నిర్మించాలన్న ప్రతిపాదలను ఆమోదించింది. కేంద్రం వాటాగా నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం తెలిపారు. పీఎంఏవై (పట్టణ)2.0 పథకం సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ పక్కా ఇంటి వసతిని కల్పించేందుకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలను ఆర్థిక సహాయంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 118 పట్టణ ప్రాంతాల్లో మొత్తం రూ.910.65 కోట్ల (కేంద్ర ప్రభుత్వ వాటా రూ.273.20 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.637.45 కోట్లు) అంచనా వ్యయంతో 18,213 ఇండ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల ద్వారా ఇండ్ల నిర్మాణాలను చేపట్టడానికి అనుమతించినట్లు ఎండీ పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం కావడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలిపారు.






