HYD: న్యూ ఇయర్ స్పెషల్.. మెట్రో ప్రయాణికులకు శుభవార్త

by Gantepaka Srikanth |

నూతన సంవత్సర వేడుకల(New Year celebrations)కు ప్లాన్ చేస్తున్న హైదరాబాద్ నగర వాసులకు మెట్రో(Hyderabad Metro) యాజమాన్యం శుభవార్త చెప్పింది.

HYD: న్యూ ఇయర్ స్పెషల్.. మెట్రో ప్రయాణికులకు శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: నూతన సంవత్సర వేడుకల(New Year celebrations)కు ప్లాన్ చేస్తున్న హైదరాబాద్ నగర వాసులకు మెట్రో(Hyderabad Metro) యాజమాన్యం శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ వేడుకల వేళ బుధవారం రాత్రి మెట్రో టైమింగ్స్ పొడిగించారు. రేపు అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. ప్రారంభ స్టేషన్ల నుంచి సరిగ్గా రాత్రి ఒంటి గంటకు చివరి రైలు బయలుదేరనుంది.

మరోవైపు కొత్త సంవత్సర వేడుకలు సందర్భంగా నగరంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి జరగనున్న న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ వెల్లడించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రూపులుగా చేరి.. రహదారులపై కేక్ కట్ చేయడాన్ని నిషేధించినట్లు వివరించారు. ఎవరైనా హద్దులు దాటి వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. వాహనాల సైలెన్సర్లు తీసి నడిపే వారిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. అర్ధరాత్రి నుంచి నగర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి వేళ నగరంలో గస్తీ ముమ్మరంగా ఉంటుందని.. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. బైక్ విన్యాసాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. అర్ధరాత్రి వేళ.. బాణసంచా పేల్చడం వంటివి చేయవద్దని ముఖ్యంగా యువతకు సూచించారు.

Next Story