- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిగ్ వర్కర్స్‌కు తీపికబురు.. బిల్లుపై నేడు CM రేవంత్ కీలక సమీక్ష
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్ (Secretariat)లో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్ (Secretariat)లో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ భేటీలో భాగంగా రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. యూరియా పంపిణీ, భూసార పరీక్షలు, తదితర ఆంశాలపై డిస్కస్ చేసి సూచనలు ఇవ్వనున్నారు. అదేవిధంగా వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో తీసుకోవాల్సిన ముందుస్తు చర్యలపై అధికారులను అప్రమత్తం చేయనున్నారు. ఇటీవలే ప్రారంభించిన కొత్త రేషన్ కార్డుల పంపిణీలో పురగతిని అడిగి తెలుసుకోనున్నారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కొత్తగా ప్రవేశపెట్టబోయే గిగ్ వర్కర్స్ బిల్లు (Gig Workers Bill)పై కూడా సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
కాగా, గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) బిల్లు-2025ను రూపొందించిన విషయం తెలిసిందే. అయితే, ఈ బిల్లుతో గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించడం, సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం, అగ్రిగేటర్లపై బాధ్యతలను ఉంచడమే సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు, దీనిపై సూచనలు, అభిప్రాయాల కోసం ప్రజలకు అందుబాటులో ఉంచారు.






