ఇసుక భూములున్న రైతులకు గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

వరదల కారణంగా పొలంలో ఇసుక తొలగింపు చేసి వ్యవసాయ భూములను పునరుద్దరించి, రైతులకు ఆదాయం పెంచుతామని టీజీఎండీసీ వైస్​చైర్మన్, ఎండీ భవేష్​మిశ్రా తెలిపారు.

ఇసుక భూములున్న రైతులకు గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : వరదల కారణంగా పొలంలో ఇసుక తొలగింపు చేసి వ్యవసాయ భూములను పునరుద్దరించి, రైతులకు ఆదాయం పెంచుతామని టీజీఎండీసీ వైస్​చైర్మన్, ఎండీ భవేష్​మిశ్రా తెలిపారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఇసుకతో కప్పబడ భూములను మళ్లీ సాగుకు అనుకూలంగా మారుతుందని, రైతులు తమ సారవంతమైన భూమి తిరిగి ఉపయోగించుకునేందుకు వీలుంటుందన్నారు. ప్రతి క్యూబిక్​మీటర్ కు రూ. 100, ప్రతి మెట్రిక్ టన్నుకు రూ. 62.50 వరకు రైతులకు ఆదాయం లబిస్తుందని వెల్లడించారు. టార్పాలిన్​కప్పడం వంటి పనుల ద్వారా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. చట్టబద్దమైన ఇసుక సరఫరా ప్రైవేటు, ప్రభుత్వం నిర్మాణ అవసరాలకు ఉపయోగపడుతుంది. తమ సంస్ధ అక్రమ ప్రయోజనాలను నివారించడానికి సమిష్ట తనిఖీలు, డిజిటల్​పర్యవేక్షణ ఉంటుందన్నారు.

కేవలం పట్టాదారులు, సంస్ద మాత్రమే చట్టబద్దంగా ఇసుక చేస్తుందని తెలిపారు. తమ భూముల నుండి ఇసుకను తొలగించాలనుకునే రైతులు తమ జిల్లాలోని ఖనిజ, భూగర్భ శాఖ సహాయ సంచాకుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇసుక తరలింపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని, ఈ ఆదాయం జిల్లా, మండల, పంచాయతీలకు న్యాయంగా పంచి స్ధానికాభివృద్ది వినియోగిస్తారు. చట్ట బద్దమైన ప్రత్యామ్నాయం ద్వారా నదీ గర్భంలో అక్రమ ఇసుక తవ్వకాలను తగ్గిస్తుంది. స్దిరమైన ఇసుక నిర్వహణను ప్రోత్సహించి, వరదల ప్రభావాన్ని తట్టుకునే సామర్ధ్యం పెంచుతుందని వివరించారు.

Next Story