Good News: 15 ఎకరాల లోపు ఉన్న రైతులకు గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

by Ramesh Naini |   (  Updated:2025-06-23 06:41:52  IST  )

తెలంగాణలో రైతు భరోసా (Raithu barosa) నిధుల జమ కొనసాగుతోంది.

Good News: 15 ఎకరాల లోపు ఉన్న రైతులకు గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రైతు భరోసా (Rythu Bharosa) నిధుల జమ కొనసాగుతోంది. వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ. 6 వేల చొప్పున పెట్టుబడి సాయం నిధులను సోమవారం నుంచి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం వరకు 9 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసా నిధులను జమ చేసింది. తాజాగా 15 ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా (Farmer Insurance Fund) నిధులు జమ చేస్తోంది. ఈ మేరకు ఇవాళ (సోమవారం) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు మరో 513.83 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.

మొత్తం 67.01 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రూ.8284.66 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల ప్రకటించారు. కాగా, తొలి రోజు రెండు ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు, అనంతరం 4 ఎకరాలు, ఐదో రోజు 7 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేస్తూ వచ్చింది. ఇక మిగిలిన రైతుల ఖాతాల్లో కూడా ఎకరాల పరిమితితో సంబంధం లేకుండా.. సాగు భూమికి రైతు భరోసా సాయం అందజేస్తామని మంత్రి తుమ్మల ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు.

Next Story