- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
10 ఎకరాల భూమి ఉన్న రైతులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ఖాతాల్లోకి నగదు
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 16న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 16న రైతు భరోసా (Rythu Barosa) పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా మొదట రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు భరోసా నగదును అకౌంట్లలో జమ చేసింది. అలాగే ఈ నెల 17న రెండో విడతలో మూడు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. మూడో విడతలో నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు నగదు జమ చేయ గా.. తాగాజా.. 10 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులను ఈ రోజు విడుదల చేశారు. నిన్నటి వరకు 7 ఎకరాల ఉన్న రైతుల ఖాతాల్లో నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy government) జమ చేసింది. ఇప్పటివరకు రూ. 7,310.59 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 65.12 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని.. నేటితో 90% రైతు భరోసా కార్యక్రమం పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే చివరగా సోమవారం నాటికి 100% రైతు భరోసా పూర్తి చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
- Tags
- Rythu-barosa






