- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడెకరాల రైతులకు శుభవార్త.. ‘రైతు భరోసా’ నిధులు విడుదల
తెలంగాణలో వరుసగా రెండోరోజు కూడా వానాకాలం ‘రైతుభరోసా’ నిధులు డైరెక్ట్‌గా అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సీజన్‌కు సంబంధించి ‘రైతుభరోసా’ (Rythu Bharosa) పెట్టుబడి సాయం నిధుల పంపిణీ ప్రక్రియ రెండోరోజూ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రణాళికల ప్రకారం అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పద్ధతిలో నేరుగా నగదు జమ అవుతోంది. నిధుల పంపిణీలో భాగంగా ఇవాళ మూడెకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. రెండో రోజు లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తే.. తెలంగాణలో మొత్తం 10.68 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.1,590.02 కోట్ల నిధులు బదిలీ కానున్నాయి.
ఇప్పటి వరకు రూ.4,072 కోట్లు జమ..
కాగా, వానాకాలం సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం మొత్తం 54.96 లక్షల మంది రైతుల ఖాతాలకు గాను రికార్డు స్థాయిలో రూ.4,072.04 కోట్ల నిధులను సక్సెస్‌ఫుల్‌గా బదిలీ చేసింది. అయితే, ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుండటంతో రైతన్నలు ఉత్సాహంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.






