- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలోని అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 50 శాతం డిస్కౌంట్‌తో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ
తెలంగాణలో 50 శాతం రాయితీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇవాళ ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ‘రైతునేస్తం’ కార్యక్రమంలో భాగంగా సచివాలయంలో ఇవాళ పచ్చిరొట్ట విత్తనాల పంపిణీని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageswara Rao) అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageswara Rao) మాట్లాడుతూ.. రైతులకు మేలు చేసేందుకు గాను పచ్చిరొట్ట, జీలుగ, జనుము, పిల్లపెసర విత్తనాలను 50 శాతం భారీ రాయితీ (Subsidy)తో అందిస్తున్నామని ప్రకటించారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించి, భూసారాన్ని పెంచేందుకు పచ్చిరొట్ట పంటలను ఎక్కువగా సాగు చేయాలన్నారు. సేంద్రీయ పద్ధతుల ద్వారా భూమిని కాపాడుకుంటూనే అధిక దిగుబడులు సాధించాలి మంత్రి తుమ్మల ఆకాంక్షించారు.
రైతులకు కీలక సూచనలు..
నిస్సారంగా మారిన నల్లబీడు భూములను తిరిగి సాగులోకి తెచ్చేందుకు, వాటి పునరుద్ధరణకు రైతులు జిప్సం (Gypsum)ను వినియోగించాలని మంత్రి తుమ్మల సూచించారు. అదేవిధంగా సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆయిల్ పామ్ వంటి లాభదాయకమైన పంటల వైపు అన్నదాతలు దృష్టి పెట్టాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు.






