- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Thummala: యూరియా పంపిణీ విషయంలో రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్
యూరియా సరఫరాపై మంత్రి తూమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో:యూరియా (Shortage) పంపిణీలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ఆదేశించారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని, రాజకీయ స్వార్థంతో కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలపై రైతులు ఆలోచన చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రైతాంగానికి భరోసాగా నిలుస్తుందని చెప్పారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. యూరియాను కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ పెట్టుకోవద్దని రైతులకు సూచించారు.
యూరియా పంపిణీకి మరిన్ని కేంద్రాలు:
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు యూరియా పంపిణీకి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీ ఓ ప్రకటన విడుదల చేశారు. యూరియా పక్కదారి పట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా 500 రైతు వేదికల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు వేదికల వద్ద రైతులకు టోకెన్లు జారీ చేసి క్యూ లైన్లు లేకుండా యూరియా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ చర్యలతో సజావుగా యూరియా పంపిణీ జరుగుతుండటంపై అన్నదాతల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు యూరియా కేంద్రాలు 12 వేల వరకు ఉన్నట్లు చెప్పిన ఆయన.. ఎక్కువ మంది రైతులు ప్రభుత్వ కేంద్రాల వద్దనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని.. అందువల్లే ఆయా కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడుతుందని తెలిపారు.






