తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్: అందుబాటులోకి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-17 13:04:36  IST  )

తిరుమల భక్తుల కోసం చర్లపల్లి-తిరుచానూర్ మధ్య సరికొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది.

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్: అందుబాటులోకి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేవదేవుడు.. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడుని దర్శించుకునే భక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కొత్త రైలు సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణలోని చర్లపల్లి (Charlapalli) టెర్మినల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుచానూర్ (Tiruchanur) మధ్య సరికొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు (Weekly Express Train) సర్వీస్‌ను ఇవాళ ప్రారంభిస్తున్నట్లుగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ కొత్త రైలు అందుబాటులోకి రావడం వల్ల తిరుపతి, తిరుచానూర్ వెళ్లే భక్తులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.

ప్రతి ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నెంబర్ 17059 (చర్లపల్లి-తిరుచానూర్) చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఇది మల్కాజ్‌గిరి, కాచిగూడ, మహబూబ్‌నగర్, కర్నూలు సిటీ మీదుగా ప్రయాణించి మరుసటి రోజు సోమవారం మధ్యాహ్నం 12.30కి తిరుచానూర్ చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నెంబర్ 17060 (తిరుచానూర్ - చర్లపల్లి) సోమవారం సాయంత్రం 4 గంటలకు తిరుచానూర్ నుంచి ప్రారంభమై మరుసటి రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అయితే, ఈ వీక్లీ సర్వీస్ భక్తుల రద్దీని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడనుంది.

Next Story