తిరుపతి వెళ్లే భక్తులకు తీపికబురు.. ఇక చర్లపల్లి టెర్మినల్ నుంచి స్పెషల్ ట్రైన్లు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-18 02:33:57  IST  )

పెరుగుతోన్న రద్దీ, ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు అందిన నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వేస్ (South Central Railways) కీలక నిర్ణయం తీసుకుంది.

తిరుపతి వెళ్లే భక్తులకు తీపికబురు.. ఇక చర్లపల్లి టెర్మినల్ నుంచి స్పెషల్ ట్రైన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: పెరుగుతోన్న రద్దీ, ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు అందిన నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వేస్ (South Central Railways) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వివిధ ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక వీక్లీ సర్వీసులను నడిపేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 15 వరకు (ప్రతి శుక్రవారం) ఎర్నాకుళం- పాట్నా (06085) మార్గంలో నాలుగు రైళ్లు, ఈనెల 28నుంచి ఆగస్టు 18 వరకు (ప్రతి సోమవారం) పాట్నా-ఎర్నాకుళం (06086) మధ్యలో నాలుగు రైళ్లు నడుస్తాయని తెలిపారు. ఆగస్టు 3 నుంచి 24వరకు (ప్రతి ఆదివారం) తిరుపతి - చర్లపల్లి(Tirupati - Charlapally) (07481) మార్గంలో నాలుగు రైళ్లు, ఆగస్టు 4నుంచి 25వరకు (ప్రతి సోమవారం) చర్లపల్లి - తిరుపతి (07482) రూట్లలో నడుపనున్నట్లుగా సౌత్ సెంట్రల్ రైల్వేస్ అధికారులు తెలిపారు.

Next Story