సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్: ఫ్రీ కోచింగ్‌కు BC స్టడీ సర్కిల్ నోటిఫికేషన్

by Kema Shiva Kumar |

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ పరీక్షలకు ఉచిత కోచింగ్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.

సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్: ఫ్రీ కోచింగ్‌కు BC స్టడీ సర్కిల్ నోటిఫికేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. దేశంలోనే అత్యున్నతమైన ఈ పరీక్షల కోసం అభ్యర్థులకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ (Free Coaching) ఇచ్చేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉచిత కోచింగ్ ప్రోగ్రామ్ ద్వారా అభ్యర్థులకు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన నిపుణులైన ఫ్యాకల్టీతో శిక్షణ అందిస్తారు.

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ..

అయితే, ఈ ఉచిత సివిల్స్ కోచింగ్ కోసం ఈనెల 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా జరగనుంది. వచ్చే నెల ఆగస్టు 7 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్ అధికారిక వెబ్‌సైట్ www.tgbcstudycircle.cgg.gov.in‌ను సందర్శించి నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మొత్తం 150 మంది అభ్యర్థులను ఈ ఉచిత కోచింగ్ కోసం ఎంపిక చేయనున్నారు. ఎంపిక ప్రక్రియ రెండు విధాలుగా ఉండనుంది. సంస్థ నిర్వహించే ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్ష ద్వారా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక గత సివిల్స్ పరీక్షల్లో ఇప్పటికే ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన (Prelims Qualified) 50 మంది అభ్యర్థులను నేరుగా తీసుకుంటారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ ఏడాది ఆగస్టు 24 నుంచి 2027 మే వరకు బీసీ స్టడీ సర్కిల్‌లో నిరంతరాయంగా సివిల్స్ కోచింగ్ తరగతులు నిర్వహిస్తారు. ఉచిత శిక్షణతో పాటు అభ్యర్థులకు స్టడీ మెటీరియల్, లైబ్రరీ సౌకర్యం కూడా అందుబాటులో ఉండనుంది.

Next Story