DA: పండగ పూట గుడ్ న్యూస్.. ఉద్యోగులకు డీఏ,డీఆర్ పెంపు

by Prasad Jukanti |   (  Updated:2025-10-01 09:56:08  IST  )

పండగ పూట ప్రభుత్వ ఉద్యోగులకు తీపీ కబురు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

DA: పండగ పూట గుడ్ న్యూస్.. ఉద్యోగులకు డీఏ,డీఆర్ పెంపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దసరా, దీపావళి పండగల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పింది. (Central government) ఉద్యోగులు,పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR) ను 3 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో సమావేశమైన సెంట్రల్ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన డీఏ, డీఆర్ లు ఉద్యోగులకు జూలై 1 నుంచి వర్తించనున్నాయి. దీంతో దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం లభించనుండగా కేంద్రంపై రూ. 10,084 కోట్ల భారం పడనుంది.

Next Story