- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆశావహులకు గుడ్ న్యూస్.. మద్యం షాపుల టెండర్లకు నోటిఫికేషన్ విడుదల
అశావాహులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆశావహులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2025-2027 సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇవాళ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. లిక్కర్ షాపు కోసం కనీస దరఖాస్తు రుసుము రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. ఫిక్స్‌డ్ షాప్ ఎక్సైజ్ టాక్స్ ఆధారంగా లాటరీ ద్వారా ఆశావహులకు షాపులను కేటాయించనున్నారు. లైసెన్స్ కాలం 01.12.2025 నుంచి 30.11.2027 వరకు నిర్ణయించారు. ఈసారి మద్యం షాపు కేటాయింపుల్లో గౌడ సామాజికవర్గానికి 15 శాతం, ఎస్సీ సామాజికవర్గానికి 10 శాతం, ఎస్టీ సామాజికవర్గానికి 5 శాతం షాపులను కేటాయించనున్నారు. భాగస్వామ్య సంస్థలు, కంపెనీలు దరఖాస్తు చేయడానికి అనుమతించారు. అదేవిధంగా ఒకే దరఖాస్తుదారుడు ఒక లిక్కర్ షాపునకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు దాఖలు చేయవచ్చు.
6 శ్లాబ్‌లలో లైసెన్స్‌ల జారీ ఇలా..
మొత్తం 6 శ్లాబ్‌లలో ఎక్సైజ్ శాఖ లైసెన్స్‌లను జారీ చేయనుంది. 2011 జనాభా లెక్క ప్రకారం 5 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి ఎక్సైజ్ ట్యాక్స్ రూ.50 లక్షలు, 5 వేల నుంచి 50 వేలు జనాభా ఉన్న పాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి 1 లక్ష జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.60 లక్షలు, 1 లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలు, ఇక 20 లక్షలపైన జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి ఎక్సైజ్ ఫీజు రూ.కోటి పది లక్షలుగా నిర్ణయించారు.
అయితే, లాటరీ ద్వారా లిక్కర్ షాపులను పొందిన వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన వార్షిక ఫీజును ప్రతి ఏటా ఆరు సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. 25 నెలల లైసెన్స్ కాలానికి గాను 1/4వ వంతు అంటే 25 శాతం సమానమైన బ్యాంక్ గ్యారెంటీ ప్రభుత్వానికి సమర్పించాలి. GHMC, నగర పంచాయతీల పరిధిలో మద్యం షాపులను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10.00 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచేందుకు అనుమతిస్తారు.






