- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా కొత్త బ్రాండ్స్
రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ నిర్ణయంతో కొత్త రకం మద్యం బ్రాండ్లు రానున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ నిర్ణయంతో కొత్త రకం మద్యం బ్రాండ్లు రానున్నాయి. రాష్ట్రంలో నూతన మద్యం బ్రాండ్లను ఆహ్వానిస్తూ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) జారీ చేసిన నోటిఫికేషన్ కు 92 కంపెనీలు ధరఖాస్తు చేసుకున్నాయి. 15 రోజులలో అనుమతుల ప్రక్రియ సిద్ధం చేసేందుకు ఎక్సయిజ్ శాఖ సమయుత్తం అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్త కంపెనీలకు ఆహ్వానించేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని నెల రోజులలో ప్రక్రియ పూర్తి కావాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టారు. రాష్ట్రంలో సరఫరాలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ల కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఫిబ్రవరి 23న టీజీబీసీఎల్ ప్రకటన చేసింది.
92 కంపెనీలు 604 బ్రాండ్లకు దరఖాస్తు
టీజీబీసీఎల్ నోటీఫికేషన్ కు దేశీయ, విదేశాలకు చెందిన 92 కంపెనీలు, 604 బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చినట్లుగా ఎక్సయిజ్ అధికారులు తెలుపుతున్నారు. 92 కంపెనీలలో 45 కంపెనీలు టీజీబీసీఎల్ కు సరఫరా చేస్తున్న కంపెనీలు కావడం గమనార్షం. 45 కంపెనీలలో 32 దేశీయ కంపెనీలు (ఇండియన్ మెడ్ లిక్కర్స్ బ్రాండ్స్), 13విదేశీ కంపెనీలు (ఫారిన్ లిక్కర్ బ్రాండ్స్) ఉన్నాయి. 32 దేశీయ కంపెనీలు 149 బ్రాండ్లను సరఫరా చేసేందుకు ధరఖాస్తు చేశాయి. 13 విదేశి కంపెనీలు 69 బ్రాండ్లను సరఫరా చేసేందుకు ధరఖాస్తు చేశాయి.
47 కొత్త కంపెనీల ధరఖాస్తు
రాష్ట్రంలో ఇప్పటికీ వరకు మద్యం సరఫరా చేయని 47 కొత్త మద్యం కంపెనీలు దరఖాస్తు చేసుకున్నట్టు టీజీబీసీఎల్ అధికారులు తెలుపుతున్నారు. వాటిలో 28 దేశీయ కంపెనీలు (ఇండియన్ మెడ్ లిక్కర్స్ బ్రాండ్స్), 19 విదేశీ కంపెనీలు (ఫారిన్ లిక్కర్ బ్రాండ్స్) ఉన్నాయి. 28 దేశీయ కంపెనీలు 182 బ్రాండ్లకు దరఖాస్తు చేసుకున్నాయి. 18 విదేశీ కంపెనీల నుంచి 204 బ్రాండ్లకు దరఖాస్తు చేసుకున్నాయి. మద్యం కంపెనీలు దరఖాస్తులకు మొదటి మార్చి 15వ తేదీ వరకు అప్లికేషన్స్ స్వీకరించారు. తరువాత మరో రెండు వారాలకు గడువు పెంచారు. మద్యం అమ్మకాలపై నాణ్యత ప్రమాణాలతో అమ్మకాలు జరుపుతున్నట్లుగా, మద్యం అమ్మకాలపై ఎలాంటి అరోపణలు లేవనే నిర్ధారణ సర్టిపికేషన్ పత్రం దరఖాస్తుతో జత పరచాలని తెలిపారు. ధరఖాస్తు చేసుకున్న కంపెనీల అథరైజ్డ్ సర్టీఫికెట్ల పరీశీలిన, మద్యం క్వాలీటీ , ధరలను బట్టి కంపెనీలకు సరఫరా అవకాశం కల్పించనున్నట్లు టీజీబీసీఎల్ అధికారులు తెలుపుతున్నారు.






